‘విరాట్‌’కి కానుక ఇచ్చిన ప్రభాస్‌


హైదరాబాద్‌: ‘బాహుబలి’ ప్రభాస్‌ విరాట్‌కి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. విరాట్‌ అంటే మన టీం ఇండియా కెప్టెన్‌ కాదండోయ్‌! ప్రముఖ నటుడు విక్రమ్‌ ప్రభు కుమారుడు. విరాట్‌ ప్రస్తుతం ‘నెరుప్పుడా’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ నెలలో విరాట్‌ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌.. విరాట్‌కి ‘బాహుబలి’ ఖడ్గాన్ని కానుకగా ఇచ్చారు. ఖడ్గంపై ‘టు విరాట్‌.. విత్‌ లవ్‌ ప్రభాస్‌’ అని రాశారు. ఈ విషయాన్ని విక్రమ్‌ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘ఓ మంచియువకుడికి మంచి మనిషి ఇచ్చిన కానుక. ధన్యవాదాలు ప్రభాస్‌. నువ్వు గొప్పవాడివి’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

Comments