ఈ ఫొటో చూసి మీరేమనుకున్నారు? Write your comments

కాస్త పైనున్న ఫొటోను గమనించండి. ఒక్కసారిగా చూస్తే బుర్ఖాలు వేసుకున్న మహిళలు కూర్చున్నట్లు ఉంది కదూ? తీక్షణంగా చూస్తే కానీ అవి బుర్ఖాలు కాదు బస్సులోని సీట్లన్న విషయం తెలీడంలేదు. అందుకే ఈ ఫొటో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
ఈ ఫొటోను మొదట నార్వేకి చెందిన యాంటీ ఇమ్మిగ్రెంట్స్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత నెటిజన్లు షేర్‌ చేయడంతో ‘వాట్‌ డూ పీపుల్‌ థింక్‌ ఆఫ్‌ దిస్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అయింది. దాంతో చాలా మంది నెటిజన్లు తామూ ఈ ఫొటో చూసి బుర్ఖాలు వేసుకుని కూర్చున్నారనే అనుకున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

Comments