జై లవకుశ’ రెండో టీజర్‌ ఈనెల...

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. రాశీ ఖన్నా కథానాయిక. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. ఇటీవల ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ పాత్రని పరిచయం చేయబోతున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఈనెల 7న ఉదయం 10గం.35 నిమిషాలకు ‘జై లవకుశ’ రెండో టీజర్‌ విడుదల కానుంది. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘ఎన్టీఆర్‌ అభిమానులకు పండగలాంటి చిత్రమిది. ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మూడో టీజర్‌నీ విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

Comments