ఇలియానాతో డేటింగ్‌ చేసిన తెలుగు హీరో ఎవరు?

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే బాలీవుడ్‌లో ఆమె అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉంది. తను, ఆండ్రూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది.
 
తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా.. తన పాత పరిచయాల గురించి, టీనేజ్‌ లవ్‌ గురించి, సినీ పరిశ్రమలోని కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది. తను 15 ఏళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టానని చెప్పింది. అలాగే టీనేజ్‌లోని హార్మోన్ల ప్రభావం వల్ల ఓ తెలుగు హీరోతో ఆరేళ్లపాటు డేటింగ్‌ చేశానని వెల్లడించింది. అయితే ఆ తర్వాత అతనితో విడిపోయినట్టు తెలిపింది. అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. అలాగే కాస్టింగ్‌ కౌచ్‌ అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని, సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.

Comments