సినిమాకు వద్దన్నందుకు కాల్వలోకి దూకేసింది

రాజారెడ్డికి ఇటీవల తిరుపతమ్మ అనే యువతితో వివాహమైంది. ఆదివారం కావడంతో సినిమాకు వెళ్దామని తిరుపతమ్మ భర్తను కోరింది. అయితే రాజారెడ్డి ఇప్పుడొద్దని వారించాడు. దీంతో అలిగిన ఆమె సమీపంలోని కాలువలోకి దూకేసింది. గమనించిన భర్త ఈత రాకపోయినా భార్యను రక్షించేందుకు తానూ కాలువలోకి దూకాడు. ఇరువురు కొట్టుకుపోతున్న సమయంలో సమీపంలోని ధర్మాచౌక్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుళ్లు చూసి కాలువలోకి దూకి వారిని కాపాడారు. చిన్న విషయానికే ఆత్మహత్యాయత్నం చేసిన తిరుపతమ్మకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి.. రాజారెడ్డిని కూడా గట్టిగా హెచ్చరించారు.

Comments