ఆడపిల్లనమ్మా..’ అంటూ తెలుగువారికి పరిచయమైన మధుప్రియ.. తన పాటలతో ‘ఫిదా’ చేసి ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోకు ఎంపికైంది. అయితే అక్కడి వాతావరణం సహకరించకపోవడంతో గతవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్’ విశేషాలను ‘ఏబీఎన్’తో ముచ్చటించింది మధుప్రియ. బిగ్‌బాస్ అవకాశం వచ్చినప్పుడు తాను ఎంతో సంతోషించానని, అయితే ఆ సమయంలో ఓ ఇబ్బంది కూడా వచ్చిందని మధుప్రియ చెప్పింది.
‘‘బిగ్‌బాస్ షో ప్రారంభం కావడానికి 25 రోజుల ముందే నన్ను సంప్రదించారు. ఆ సమయంలో వాళ్లు నన్ను ఇంటర్వ్యూ చేసి చాలా కండీషన్లు పెట్టారు. బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినట్లు ఎవరికీ చెప్పకూడదని కండీషన్ పెట్టారు. ఒకవైపు ‘ఫిదా’ సినిమా రిలీజ్ అవుతోంది. మరోవైపు బిగ్‌బాస్‌కు రెడీ అవ్వాలి. ఆ సమయంలోనే ఫిదా ప్రమోషన్స్ కోసం చాలా మంది ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే నేను వెళ్లడానికి లేదు. నేను రాకపోవడానికి కారణం బిగ్‌బాస్ అని నా నోటితో నేను చెప్పకూడదు. వెళ్లకపోతేనేమో వాళ్లు ఫీలవుతారు. ఆ విషయంలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. బిగ్‌బాస్ ఆఫర్ గురించి మా ఫ్యామిలీకి తప్ప వేరెవరికీ చెప్పలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి నేను వెళ్లాక.. ఈ అమ్మాయి రాకపోవడానికి కారణం ఇదేనేమో అని అందరూ అర్థం చేసుకుంటారని అనుకున్నా. అందుకే బిగ్‌బాస్ ఆఫర్ గురించి ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్‌గా దాచా.’’ అని చెప్పుకొచ్చింది మధుప్రియ.
Comments
Post a Comment