దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘కలి’. ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. అనువాద హక్కులను డి.వి. కృష్ణస్వామి దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు అనువాదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా టైటిల్, లోగోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.
గోపీసుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సమీర్ తాహిర్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ‘ఫిదా’తో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె నానితో కలిసి ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఓకే బంగారం’తో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ఆయన ‘సావిత్రి’లో నటిస్తున్నారు.
Comments
Post a Comment