ఆగస్టు 7న తిరుమల దేవస్థానికి వెళ్లొద్దు.

ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు, ఆగస్టు 7న చంద్రగ్రహణం రాత్రి 10:52 గంటలకు మొదలై అర్థరాత్రి 12:48 గంటలకు ముగుస్తుందని, శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7 వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుండి ఆగస్టు 8 వ తేదీ ఉదయం 2 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత ఆగస్టు 8వ తేదీన వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నట్లు వివరించింది. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుండి ఆగస్టు 8వ తేదీ ఉదయం 7 గంటల వరకు భక్తులెవరికి శ్రీవారి ఆలయంలోకి అనుమతి లేదు, ఈ విషయాన్నీ భక్తులు దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Comments