మాదక ద్రవ్యాల కేసులో సినీ నటి ఛార్మి వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. సిట్ విచారణలో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఛార్మి విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, బలవంతంగా ఆమె రక్త నమూనాలను సేకరించరాదని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఛార్మిని విచారించాలని ఆదేశించింది. ఒకవేళ విచారణ పూర్తికాకపోతే మరో రోజు విచారణకు పిలవాలని సూచించింది. విచారణ బృందంలో మహిళను నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అంతకుముందు డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఛార్మి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన అంగీకారం లేకుండా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించవద్దని ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. తన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేని కారణంగా న్యాయవాదిని తనతో పాటు అనుమతివ్వాలని ఛార్మి పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Post a Comment