షారుక్ ఖాన్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు. ఇక ఆయన భార్య గౌరీ ఖాన్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. అలా ఇద్దరూ వారి వృత్తుల్లో కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఇద్దరూ అంత సంపాదిస్తున్నప్పుడు ఇక వారి పిల్లల జీవితాలకు ఎలాంటి ఢోకా ఉండదు అనుకుంటాం. కానీ తన పిల్లలు వారి కష్టంతోనే బతకాలి అంటున్నాడు షారుక్.
ఓ ఇంటర్వ్యూలో షారుక్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ‘మేము మధ్య తరగతికి చెందినవాళ్లం. మాకు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. మన దగ్గర డబ్బుంటే దాన్ని చక్కని జీవితానికే ఉపయోగించాలన్నది నేను గౌరి నమ్మే సిద్ధాంతం. నేను ఎప్పుడూ డబ్బు పొదుపు చేసుకోలేదు. సంపాదించినదంతా సినిమాల్లో ఖర్చుచేస్తాను. కానీ నా పిల్లలకు అలా ఉండదు. నేను ముంబయి వచ్చినప్పుడు నాకు ఇల్లు లేదు. నా కష్టంతో నేను కొనుక్కున్నాను. కాబట్టి నా పిల్లలకు ఓ ఇల్లు కట్టించి ఇస్తాను. వారికి సరైన చదువులు చదివిస్తాను. నా పిల్లలు చూడ్డానికి చక్కగా ఉంటారన్న మాటేకానీ అంతకుమించి వారి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. వారి కష్టంతోనే మెరుగైన జీవితాన్ని అనుభవించాలి. వారికి కావాల్సినదంతా తల్లిదండ్రులుగా మేము ఏర్పాటుచేస్తాం. కానీ వారు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి మాత్రం మేము డబ్బు పొదుపు చేసుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు షారుక్.
Comments
Post a Comment